ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మావోయిస్టులతో సంబంధాలు... తెలంగాణలో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

By

Published : Jun 23, 2022, 7:02 PM IST

Updated : Jun 23, 2022, 7:18 PM IST

NIA Arrest: తెలంగాణలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్​లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

NIA
NIA

NIA in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరిపింది. నర్సింగ్‌ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్​ఐఏ అధికారులు.. హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్​లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు.

ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్‌లో ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో డిజిటల్ సామగ్రి, మావో భావజాల సామగ్రి స్వాధీనం చేసుకుంది. మావోయిస్టు అనుబంధ సంస్థతో దేవేంద్ర, స్వప్న, శిల్పకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. చైతన్య మహిళా సంఘం ముగ్గురూ పని చేసినట్లు ఎన్ఐఏకు ఆధారాలు లభించాయి. యువత నక్సల్స్‌లో చేరేలా ముగ్గురు ప్రోత్సహించారని ఎన్ఐఏ తేల్చింది. ఆంధ్రప్రదేశ్​లోని పెదబయలులో ఈ ఏడాది జనవరి 3న ముగ్గురిపై కేసు నమోదు కాగా.. ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. గురువారం ఎన్‌ఐఏ వీరిని అదుపులోకి తీసుకుంది.

ఇదీ చూడండి:

Last Updated : Jun 23, 2022, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details