ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

By

Published : Aug 9, 2021, 9:44 PM IST

జలవిద్యుత్ పై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేసిందని పేర్కొంది.

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు
జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు

జలవిద్యుత్ పై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని కేంద్రం వెల్లడించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్​లో అడిగిన ప్రశ్నకు.. జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని అనేక సార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేసిందని పేర్కొంది. తెలంగాణ ఏకపక్షంగా ఉత్పత్తి చేస్తున్నట్లు సీఎం జగన్ లేఖ రాశారని జలశక్తి శాఖ తెలిపింది.

శ్రీశైలం ఎడమ కేంద్రంలో ఉత్పత్తి ఆపాలని జూన్ 17 ఆదేశించిందని.. బోర్డు ఆదేశాలు ఇచ్చే వరకు ఉత్పత్తి చేయవద్దని లేఖలో సూచించినట్లు జలశక్తి శాఖ పేర్కొంది. కేఆర్ఎంబీ ఆదేశించినా తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేసిందన్న కేంద్రం.. విద్యుదుత్పత్తి ఆపాలని జూలై 15 న తెలంగాణను బోర్డు ఆదేశించినట్లు వివరించింది.

కేఆర్ఎంబీ లేఖలపై తెలంగాణ జెన్​కో జూలై 16న ప్రత్యుత్తరం ఇచ్చిందన్న కేంద్రం.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు బోర్డుకు తెలిపారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

AP Corona: రాష్ట్రంలో కొత్తగా 1,413 కేసులు.. 18 మరణాలు

ABOUT THE AUTHOR

...view details