ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జగన్ డేంజర్ గేమ్ ఆడుతున్నారు.. చివరికి ఓటమి ఆయనదే'

By

Published : Apr 4, 2021, 5:02 PM IST

Updated : Apr 4, 2021, 7:22 PM IST

వైకాపా ప్రభుత్వ పనితీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంతకల్లులో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా జగన్ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

CPI Ramakrishna
సీపీఐ రామకృష్ణ

సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో సీఎం జగన్ డేంజర్ గేమ్ ఆడుతున్నారని... ఈ ఆట చివరకు జగన్​నే కాటేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి పనితీరు, ప్రవర్తనపై రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సాగుతోందని... ఎలక్షన్ కమిషన్​కు కూడా విలువ లేకుండా చేశారని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు మార్గ దర్శకాలను పాటించకుండా.. ఒక్క రోజులో ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎస్ఈసీ ప్రభుత్వం చెప్పినట్టు పనిచేయడానికి వచ్చిందా అని నిలదీశారు. పోలీస్, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడి దోచుకున్న సొమ్మును విచ్ఛలవిడిగా ఎన్నికల్లో పంచుతున్నారని ఆరోపించారు. వీరి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అసలు ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా చేసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుంది తప్ప... ప్రజలకు సేవ చేసేందుకు కాదనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

జగన్​కు ఇంట్లోనే ప్రతిపక్షం..!

ఇలా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనుకుంటున్న జగన్​కు కూడా.. వారి ఇంట్లోనే ప్రతిపక్షం ఏర్పడుతోందని రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే ఓ చెల్లెలు దిల్లీలో, మరో చెల్లెలు హైదరాబాద్​లో మాట్లాడుతున్నారని... వీటిపై జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం ఇప్పటికే మూడు లక్షల యాభై వేలకోట్ల అప్పులో కూరుకుపోయి కనీసం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందన్న ఆయన... ఇంకా కొత్త అప్పుల కోసం ప్రభుత్వం వెదుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వం ఏం చేసింది? ఈ అప్పులు ఎలా తీరుస్తారు? అన్నది శ్వేతపత్రంలో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

భాజపాను వ్యతిరేకించిన మరుసటి రోజే జైలుకు జగన్: నారాయణ

Last Updated : Apr 4, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details