ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi narayana: పెట్రోల్​పై పెరిగిన రూ.40లను తగ్గించండి: సీపీఐ నారాయణ

By

Published : Nov 7, 2021, 7:12 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు(cpi narayana slams central govt news). భాజపా అధికారం వచ్చిన నాటి నుంచి 40 రూపాయల వరకు పెట్రోల్ ధరలు అధికమయ్యాయని, చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైకాపాకు చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.

cpi narayana
cpi narayana

పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం వీధి నాటకాలాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు(cpi narayana slams central govt news). దసరా ఆఫర్ లా పది రూపాయలు తగ్గించటం ఏంటని ప్రశ్నించారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. భాజపా అధికారం వచ్చిన నాటి నుంచి 40 రూపాయల వరకు పెట్రోల్ ధరలు అధికమయ్యాయని, చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటుందని నారాయణ దుయ్యబట్టారు. అదానీ పోర్టు నుంచే ప్రధానంగా మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రానికి వైకాపా మద్దతుగా ఉండటంతో మాదకద్రవ్యాల రవాణాకు విజయవాడను సబ్ కేంద్రంగా ఎంచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రా నుంచే మాదకద్రవ్యాలు వస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సైతం చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైకాపాకు చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా కు వైకాపా.. నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూడటం సరికాదన్నారు.


ABOUT THE AUTHOR

...view details