ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సభ తర్వాత రాజ్​భవన్​లో మోదీ బస.. 4వేల మందితో భద్రత ఏర్పాట్లు'

By

Published : Jul 1, 2022, 5:04 PM IST

ఈ నెల 3న తెలంగాణలోని హైదరాబాద్​లో జరగనున్న భారతీయ జనతా పార్టీ సంకల్ప సభ అనంతరం ప్రధాని మోదీ రాజ్​భవన్​లో బస చేస్తారని సీపీ సీవీ ఆనంద్​ వెల్లడించారు. ఇందుకోసం రాజ్​భవన్​ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మేరకు భాజపా నేతలతో కలిసి ఆయన పరేడ్​ గ్రౌండ్స్​లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

cp cv anand
సీపీ సీవీ ఆనంద్

మాట్లాడుతున్న సీపీ సీవీ ఆనంద్

తెలంగాణలో రేపు, ఎల్లుండి జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇందుకోసం రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 3న పరేడ్​ గ్రౌండ్​లో జరగనున్న సభకు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు గ్రే హౌండ్స్, జిల్లాల నుంచి వచ్చే పోలీసులనూ ఇందుకోసం వినియోగిస్తామన్నారు. ఈ మేరకు భాజపా నేతలతో కలిసి పరేడ్​ గ్రౌండ్స్​లో భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సభా వేదిక వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్​ ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. బహిరంగ సభ పూర్తైన తర్వాత సభకు హాజరైన వారు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనాలు సభా వేదికకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 3న పరేడ్ గ్రౌండ్స్‌ సభ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించాం. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మందితో పహారా ఏర్పాటు చేశాం. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టార్ ఇంఛార్జ్‌లుగా నియమించాం. సీవీ ఆనంద్​, హైదరాబాద్ సీపీ

నేటి నుంచి 144 సెక్షన్..: మరోవైపు హెచ్​ఐసీసీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్​ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వందల మంది పార్టీ నాయకులు రెండు రోజుల పాటు నగరంలో బస చేయనుండటంతో మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు పెట్టారు. సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో నేటి నుంచి 4 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలోనేహైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వారినే లోపలికి పంపిస్తున్నారు. సైబర్‌ టవర్స్, శిల్పారామం రహదారి, అయ్యప్ప సొసైటీ రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఇవీ చూడండి..:

ABOUT THE AUTHOR

...view details