ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత దంపతులకు కరోనా పాజిటివ్

By

Published : Jul 4, 2020, 6:14 PM IST

తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆమె భర్తకు కరోనా సోకింది. వారి డ్రైవర్లూ వైరస్ బారిన పడ్డారు.

covid positive
covid positive

తెలంగాణలో కరోనా వ్యాప్తి.. ప్రభుత్వంలో భాగంగా ఉన్నవారిని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా నిర్ధరణ అయింది. శుక్రవారం మహేందర్‌ రెడ్డి భార్య ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. గొంగిడి సునీత ఇద్దరు డ్రైవర్లకు కూడా ఇప్పటికే కరోనా నిర్ధరణ అయింది. నాలుగు రోజుల క్రితం ఆమె స్వల్ప అస్వస్థతకు గురికాగా.. చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చేరారు.

అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వైరస్ సోకినట్లు తెలిపారు. రాష్ట్రంలో వరసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకుముందే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేశ్ గుప్తాతో పాటు... హోంమంత్రి మహమూద్ అలీ, ఉప సభాపతి పద్మారావు కూడా కరోనా బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details