ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలి: సీఎం

By

Published : Jan 18, 2021, 1:01 PM IST

Updated : Jan 18, 2021, 8:01 PM IST

విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ నిర్వహణ నిధిపై కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు.

cm review
సీఎం జగన్

ఫిబ్రవరి 1 నాటికి పాఠశాలల్లో టాయిలెట్ల రూపు రేఖలు మారాలని.. పరిశుభ్రంగా ఉండాలని ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. టాయిలెట్ నిర్వహణ నిధిపై కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి, పాఠశాల లేదా కళాశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. టాయిలెట్ల నిర్వహణ అనేది ప్రాధాన్యత అంశమని స్పష్టం చేశారు.

పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు తెలిపారు. మరమ్మతు రాగానే బాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టాయిలెట్ల నిర్వహణ గురించి సీఎం జగన్​కు వివరించిన అధికారులు.. టాయిలెట్ల పర్యవేక్షణకు మెుబైల్ యాప్​ను తయారు చేసినట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న సీఎం జగన్.. ఆంగ్ల మాధ్యమం ద్వారా నాణ్యమైన బోధన తీసుకొచ్చినట్లు వివరించారు.

Last Updated : Jan 18, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details