ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM JAGAN STARTED GOSHALA: సీఎం ఇంటిముందు గోశాల ప్రారంభం.. పూజలు చేసిన వైఎస్​ భారతి!

By

Published : Nov 30, 2021, 8:16 AM IST

Updated : Nov 30, 2021, 9:28 AM IST

GOSHALA STARTED INFRONT CM JAGAN HOUSE: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ముందు ఏర్పాటు చేసిన గోశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించారు. కార్తిక సోమవారం మంచి రోజు కావడంతో... గోశాలను ప్రారంభించారు.

cm-jagan-opened-goshala-infront-his-house-at-thadepalli
సీఎం జగన్ ఇంటిముందు గోశాల ప్రారంభం

CM VISIT GOSHALA IN THADEPALLI: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసం ముందు పార్కింగ్‌ స్థలంలో నిర్మించిన గోశాలను సోమవారం ప్రారంభించారు. కార్తిక సోమవారం మంచి రోజు కావడంతో దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితంగా మెలిగే చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం పిల, గిరి, సాయివాల వంటి ఆరు దేశీ ఆవులను తిరుపతి నుంచి తీసుకువచ్చారు. ఆ గోవులను ముఖ్యమంత్రి భార్య వైఎస్‌ భారతి పూజించి గోశాలలోకి తోడ్కొని వెళ్లనట్లు తెలిసింది.

సీఎం ఇంటిముందు గోశాల ప్రారంభం

CM JAGAN STARTED GOSHALA: సీఎం సతీమణి వైఎస్ భారతి వినూత్న డిజైన్​తో గోశాల నిర్మాణం చేయించినట్లు సమాచారం. సుమారు ఏడు నెలల నుంచి ఈ గోశాల నిర్మాణ పనులు జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి పర్యవేక్షణలో పనులను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఇంటిలో నుంచి ఈ గోశాలలోకి ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన గోశాలలో గోవులు దిగేందుకు వీలుగా ఒక కొలను ఏర్పాటు చేశారు. ఆ కొలనుపై చిన్న నడక వంతెనను కూడా నిర్మించారు. చుట్టూ నడక దారిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌ గోశాలను సందర్శించారు.

ఇదీ చూడండి:JAGANANNA VIDYA DEEVENA: జగనన్న విద్యా దీవెన మూడో విడత నేడే..!

Last Updated : Nov 30, 2021, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details