ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana Cm KCR tour in Delhi: నేడు దిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

By

Published : Sep 23, 2021, 1:04 PM IST

Updated : Sep 24, 2021, 3:41 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR) నేడు దిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 26న దిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది. అనంతరం ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Chief Minister KCR tour in Delhi on the 25th of this month
Chief Minister KCR tour in Delhi on the 25th of this month

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం హస్తిన పయనమవుతున్నారు. ఇవాళ శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ ముగిశాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం రోజు.. కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో చర్చిస్తారు.

ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్​ పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చిస్తారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా...

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానుండగా.. ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే లేఖలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.

ఇప్పటికే దిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్​

ఈ నెల 1న కేసీఆర్​ దిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం దిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2వ తేదీన దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీ(PM NARENDRA MODI)తో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.

ఇదీ చూడండి:Maoist avirbhava dinotsavam: ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు.. భారీగా పాల్గొన్న గిరిజనులు

Last Updated : Sep 24, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details