ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరుల కష్టానికి వైకాపా కబ్జా స్టిక్కర్: చంద్రబాబు

By

Published : Jun 6, 2020, 11:34 PM IST

పాలనలో తనదైన ముద్ర వేయడం అనే భావానికి... వైకాపా నేత అర్థాలే వేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ పాలనపై.. 'పరుల కష్టానికి కబ్జా స్టిక్కర్' పేరిట ఓ వీడియో విడుదల చేశారు. తెదేపా పథకాలకు వైకాపా పేర్లు పెట్టుకోవడం, తాము కట్టిన భవనాలకు వారి పార్టీ రంగులు వేసుకోవడమే వారి పాలన అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

chandrababu releases video on ycp government
వైకాపా పాలనపై వీడియో.. 'పరుల కష్టానికి కబ్జా స్టిక్కర్'

తాము తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఏడాది పాలనంతా మసిపూసి మారేడుకాయ చేసినట్లే ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాలనపై 'పరుల కష్టానికి కబ్జా స్టిక్కర్' పేరుతో వీడియో విడుదల చేశారు.

పాత రుచి-కొత్త రంగు

వైకాపా అధికారంలోకి రాగానే 36కు పైగా తెలుగుదేశం పథకాలను రద్దు చేశారని.. కొన్నింటికి పేర్లు మార్చి తమ స్టిక్కర్లు వేసుకున్నారని విమర్శించారు. పాత రుచి, కొత్త రంగు అదే వైకాపా మాయాజాలమని ఆక్షేపించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాగా చేయడమే వైకాపా మోసాలకు సాక్ష్యమన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 12 వేల 500ల రూపాయలు ఇస్తామని నమ్మించి, అందులో రూ.6 వేలు ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

సొమ్మొకరిది-సోకొకరిది

ఎప్పుడో చనిపోయిన వైఎస్ వల్లే ఇప్పుడు కియా వచ్చిందంటున్నారని.. 8 ఏళ్ల క్రితం తెచ్చిన సున్నా వడ్డీ పథకం తామే తెచ్చాం అంటున్నారని మండిపడ్డారు. కేంద్రం కరోనా సాయం కింద వెయ్యి రూపాయలు ఇస్తే.. వాటినీ తామే ఇచ్చామని డప్పు కొట్టుకుంటున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి... పిఠాపురం వాసి.. దుబాయ్​లో హతం!

ABOUT THE AUTHOR

...view details