ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రమంత్రి ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బయటపడింది: చంద్రబాబు

By

Published : Mar 9, 2021, 10:06 PM IST

Updated : Mar 9, 2021, 10:40 PM IST

ఉక్కు పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయం బయటపడిందన్నారు. సీఎం జగన్​పై విశాఖ ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్న ఆయన.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

chandrababu
చంద్రబాబు

విశాఖ ఉక్కును అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్న విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తేటతెల్లమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తుళ్లూరులో అమరావతి మహిళల్ని పరామర్శించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. విశాఖను తాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూస్తే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం నాశనం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు

విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ తెస్తే దాన్ని వెనక్కు పంపారని.. ఐటి కంపెనీలు తెస్తే వాటిని వేరేచోటికి తరలించేలా చేశారని ఆరోపించారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం పోస్కో కంపెనీతో చర్చలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రైల్వే జోన్, మెట్రో రైలు ప్రాజెక్టులు ఎందుకు తీసుకురావటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలు సీఎంపై చాలా కోపంగా ఉన్నారని.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాట పేరుతో విశాఖ ప్రజలను వంచిస్తున్నారని అన్నారు.

Last Updated : Mar 9, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details