ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రండి.. వైకాపా నియంతృత్వ పోకడలను ఎండగడదాం'

By

Published : Feb 18, 2020, 10:42 AM IST

Updated : Feb 18, 2020, 1:21 PM IST

వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు.

chandrababu fire on ycp govt over failures
chandrababu fire on ycp govt over failures

వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ, అవినీతి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెస్తామని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తామన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు చైతన్యయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక వీడియో విడుదల

రేపటి నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది.

తెదేపా విడుదల చేసిన వీడియో

ఇదీ చదవండి:

'నాడు- నేడు'కు నేడే సీఎం జగన్ శ్రీకారం

Last Updated : Feb 18, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details