ఆంధ్రప్రదేశ్

andhra pradesh

WISHES: ద్రోణవల్లి హారిక బృందానికి సీఎం జగన్, చంద్రబాబు నాయుడు అభినందనలు

By

Published : Oct 4, 2021, 2:06 AM IST

స్పెయిన్‌లో జరిగిన ఫిడే ప్రపంచ మహిళా జట్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రజత పతకం సాధించిన హారిక ద్రోణవల్లి సహా భారత బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు.

సీఎం జగన్, చంద్రబాబు నాయుడు అభినందనలు
సీఎం జగన్, చంద్రబాబు నాయుడు అభినందనలు

ఫిడే ప్రపంచ మహిళా జట్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రజత పతకం సాధించిన హారిక ద్రోణవల్లి సహా భారత బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. టీమ్ ఈవెంట్‌లో హారిక అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హారిక తో సహా భారత జట్టుకు మరిన్ని అవార్డులు రావాలని సీఎం కోరుకున్నారు.

చంద్రబాబు అభినందనలు...

ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న ద్రోణవల్లి హారిక బృందానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆక్షాంక్షిస్తూ.. ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

'వైకాపా అధికారంలోకి వచ్చాక పల్నాడులో రౌడీయిజం పెరిగింది'

ABOUT THE AUTHOR

...view details