ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telugu Academy case: నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు.. నిధుల మళ్లింపుపై ఆరా

By

Published : Dec 3, 2021, 8:41 PM IST

Updated : Dec 3, 2021, 11:54 PM IST

Telugu Academy: తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల నిధులను ఎక్కడికి మళ్లించారనే దానిపైనే ఆరా తీస్తున్నారు.

నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు
నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు

Telugu Academy: తెలుగు అకాడమీ కేసు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్​ గూడ జైల్లో ఉన్న ఆరుగురు నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించగా.. ఇవాళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Accused into custody: చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సాయి కుమార్, వెంకట రమణ, సోమశేఖర్, వెంకట్, రమేశ్, సత్యనారాయణలను సీసీఎస్​కు తరలించి ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలను వాటాలుగా పంచుకున్న నిందితులు.. వాటిని ఎక్కడికి మళ్లించారనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఆస్తుల జప్తు

CCS police: ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలకు లెక్క తేలకపోవడంతో డిపాజిట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నిందితులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వీళ్లందరూ డబ్బులను వాటాలుగా పంచుకొని పలుచోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిధుల మళ్లింపుపై ఆరా

ccs custody: రెండు రోజుల పాటు నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు సీసీఎస్ పోలీసులు యత్నిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి యూనియన్, కెనరా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఆ తర్వాత నగదును విడతల వారీగా విత్ డ్రా చేసుకొని వాటాలు పంచుకున్నారు.

ఇదీ చూడండి:

Weather Update: ముంచుకొస్తున్న 'జవాద్' ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

Last Updated :Dec 3, 2021, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details