ఆంధ్రప్రదేశ్

andhra pradesh

bull kart: సిరిసిల్లలో ఎడ్లబండి బీభత్సం.. పరుగులు తీసిన జనాలు

By

Published : Dec 1, 2021, 9:33 AM IST

భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలో ఎడ్లబండి బీభత్సం సృష్టించింది. జనాలను చూసి భయపడి ఎడ్లు పరుగులు పెట్టడంతో అక్కడికి వచ్చిన ప్రజలతో పాటు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

bullkart-mishap-in-bjp-protest-in-rajanna-siricilla-district
బీభత్సం సృష్టించిన ఎడ్లబండి... పరుగులు తీసిన జనాలు

బీభత్సం సృష్టించిన ఎడ్లబండి... పరుగులు తీసిన జనాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలో ఎడ్ల బండి బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వైవిధ్యంగా ఎడ్ల బండిపై వెళ్లాలని భావించారు. కార్యకర్తలు ఎడ్లబండిపై వస్తున్న తరుణంలో ఎడ్లు బెదిరిపోయాయి. జనాలను చూసి పరుగులు పెట్టడంతో అక్కడికి వచ్చిన ప్రజలతో పాటు పోలీసులు భయాందోళనకు గురయ్యారు.

బెదిరిపోయి పరుగులు తీస్తున్న ఎడ్లబండి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎడ్లబండిపై ఉన్న భాజపా పట్టణ అధ్యక్షుడు వేణు కిందపడిపోగా.. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details