ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈనెల 20 లేదా 21న భాజపాలో చేరనున్న బూరనర్సయ్య గౌడ్‌

By

Published : Oct 17, 2022, 9:35 AM IST

Boora joining in BJP update: తెరాసకు గుడ్​బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ భాజపా తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20 లేదా 21 తేదీల్లో హస్తినలో ఆయన కమలం కండువ కప్పుకోనున్నారు. ఇందుకోసం ముందుగా భాజపా రాష్ట్ర నేతలు ఈనెల 19న బూర నర్సయ్య గౌడ్​తో సమావేశం కానున్నారు.

boora narsaiah goud
బూర నర్సయ్య గౌడ్‌

Boora joining in BJP update: ఈనెల 20 లేదా 21 న దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ భాాజపాలో చేరనున్నారు. భాజపా రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు ఈనెల 19న నర్సయ్యగౌడ్​ ఇంటికి వెళ్లి సమావేశం కానున్నారు. తరువాత హస్తినకు వెళ్లి పార్టీ హైకమాండ్ పెద్దల సమక్షంలో ఈనెల 20 లేదా 21న భాజపాలో చేరనున్నారు.

ఈ నెలాఖరున 27 లేదా 28న హైదరాబాద్​ శివారులో భాజపా బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించనుంది. ఆ సభలో బూర నర్సయ్య వర్గీయులు కమలం పార్టీలో చేరనున్నారు. ఆ సభకు పార్టీ ముఖ్య నేత హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెరాసకు రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్... అందుకు గల కారణాలపై మఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

తాను తెరాస నుంచి వెళ్లలేదని.. ముఖ్యమంత్రి కేసీఆరే వద్దనుకుని అవమానించి పార్టీ నుంచి పంపించారేమోనని బూర నర్సయ్య గౌడ్‌ లేఖలో ఆరోపించారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకపోతే.. పార్టీలో ఉండటం వృథా అని రాజీనామా చేసినట్లు తెలిపారు. అభిమానానికి.. బానిసత్వానికి తేడా ఉంటుందన్న ఆయన.. రాజకీయ వెట్టిచాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని లేఖలో పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బూర నర్సయ్య పోటీ చేస్తారని... ఈ మేరకు భాజపా అధిష్ఠానం నుంచి హామీ లభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెరాస మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంశంపైనా కూడా తెరాసలో చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details