ETV Bharat / city

జనసేనకు పలు పార్టీల మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన పవన్‌

author img

By

Published : Oct 16, 2022, 8:11 PM IST

PAWAN KALYAN THANKS TO ALL : జనసేనకు మద్దతు తెలిపిన పలు పార్టీ నేతలకు జనసేనాని పవన్​ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరూ చూశారని.. ప్రభుత్వ వైఖరిని ఖండించిన నేతలకు ధన్యవాదాలు చెప్పారు.

PAWAN THANKS TO PARTY LEADERS
PAWAN THANKS TO PARTY LEADERS

PAWAN THANKS TO PARTY LEADERS : తమకు సంఘీభావం తెలిపిన అందరికీ జనసేన అధినేత పవన్​కల్యాణ్​ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన పార్టీల నేతలకు ధన్యవాదాలు చెప్పారు. వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరూ చూశారని.. జనసేన నేతల అరెస్టును, ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు ఖండించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సోము వీర్రాజు, సునీల్ దేవధర్, సత్యకుమార్‌, మాధవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ చర్యలను ఖండించిన లోక్‌సత్తా జేపీకి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కృతజ్ఞతలు చెప్పారు. పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తున్న జన సైనికులను అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.