ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుట్రపూరితంగా రఘురామను అరెస్టు చేశారు: సత్యకుమార్

By

Published : May 14, 2021, 8:14 PM IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై భాజపా నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే రఘురామను అరెస్టు చేయించారని ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకుండా నేతలను అరెస్టు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

bjp leader satyakumar fire on ycp government
భాజపా నేత సత్యకుమార్

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారని అదే పార్టీకి చెందిన ఎంపీని అరెస్టు చేయడం ఏమిటని భాజపా నేత వై.సత్యకుమార్ ప్రశ్నించారు. ఈ ఘటనతో సొంత పార్టీ అసమ్మతి నేతలను హెచ్చరిస్తున్నారా అని నిలదీశారు. ఇసుక, మద్యం టెండర్ల అవినీతిని ప్రశ్నిస్తే... ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు, కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు సంగం డెయిరీ అరెస్టులు, పడకలు దొరకక, ఆక్సిజన్ అందక రోగులు అవస్థలు పడుతున్న సందర్భాల్లో పాస్టర్ల, మౌల్విల జీతాల పెంపు వంటి అంశాలతో ప్రజల దృష్టి మరల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా... జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు సూచిస్తున్నా... ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపడం ఏమిటని సత్యకుమార్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details