ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన

By

Published : Jun 6, 2022, 10:14 AM IST

Updated : Jun 6, 2022, 3:23 PM IST

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో నేటి నుంచి రెండురోజుల పాటు పర్యటించబోతున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ చేరుకోనున్న జేపీ నడ్డాకు గన్నవరం విమానాశ్రయం వద్ద భాజపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా వెళ్లి సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆవరణలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

జేపీ నడ్డా
జేపీ నడ్డా

రాష్ట్రంలో నేటి నుంచి రెండురోజుల పాటు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ చేరుకోనున్న జేపీ నడ్డాకు గన్నవరం విమానాశ్రయం వద్ద భాజపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా వెళ్లి సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆవరణలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులతో అంతర్గతంగా సమావేశం కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వెన్యూ వేదికగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో నడ్డా సమావేశమై.. మోదీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను వివరించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలోనే భాజపా, జనసేన మైత్రీ బంధం, వైకాపా, తెదేపాల పట్ల జాతీయ నాయకుల ఆలోచనలు, ఇతర విషయాల గురించి నడ్డా ప్రస్తావించనున్నట్లు సమాచారం. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో గోదావరి గర్జన పేరిట భాజపా నిర్వహిస్తోన్న బహిరంగసభకు నడ్డా ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 6, 2022, 3:23 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details