ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Agnipath army recruitment: నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

By

Published : Aug 5, 2022, 12:31 PM IST

Agnipath army recruitment

Agnipath army recruitment applications 2022: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణలోని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు ప్రకటించారు. నేటి నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Agnipath army recruitment applications 2022: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు నేటి నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణలోని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు.

ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

'అగ్నిపథ్​' కథ ఏంటంటే..

IAF Agnipath Scheme: త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది.

అగ్నిపథ్​ పథకం విధివిధానాలు..

1923 యాక్ట్​ ప్రకారం నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీరులు ఎటువంటి సైనిక రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.

కొన్ని సందర్భాల్లో అగ్నివీరులకు సమర్థ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది.

అగ్నివీరులు తమ యూనిఫామ్​పై ప్రత్యేకమైన బ్యాడ్జ్​ను ధరిస్తారు.

ఈ నోటిఫికేషన్​ ద్వారా రిక్రూట్​ అయిన వారు 1950 నిబంధనకు లోబడి విధులు నిర్వహిస్తారు.

నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పనితీరును​ బట్టి.. 25 శాతానికి మించకుండా వారిని మళ్లీ సైన్యంలోకి తీసుకుంటారు.

నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేంద్రం చేర్చుకునే వారు 15 ఏళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

నాలుగేళ్ల పూర్తయ్యాక అగ్నివీరులకు పదవిని ఎంచుకునే హక్కు ఉండదు.

రెగ్యులర్​ సర్వీస్​లో ఉన్నవారికి 90 రోజులు సెలవులు ఉంటాయి. సంవత్సరానికి 30 రోజులు అదనపు సెలవులు ఉంటాయి

వైద్యుల సలహా ఆధారంగా మెడికల్​ లీవ్​ మంజూరు చేస్తారు

అగ్నివీరుల నెలవారీ జీతంలో 30 శాతం కార్పస్​ ఫండ్ ​కోసం కోత విధిస్తారు. అయితే అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.

17.5 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకునేటప్పుడు.. ఎన్​రోల్​మెంట్​​ ఫారమ్​పై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకం తప్పనిసరి.

మిశ్రమ స్పందన.. అయితే అగ్నిపథ్‌ పథకానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని వర్గాలు ఈ పథకాన్ని స్వాగతించగా, నిరుద్యోగ యువతతోపాటు కొందరు మాజీ సైనికోద్యోగులూ నిరసన స్వరం వినిపించారు. కొన్నిచోట్ల యువకులు హింసాకాండకూ పాల్పడటం బాధాకరం. విచ్చలవిడిగా దౌర్జన్యకాండకు దిగిన యువకులు క్రమశిక్షణకు మారుపేరైన సాయుధ బలగాల్లో చేరడానికి అనర్హులు. అందుకే అలాంటి వారికి సాయుధ బలగాల్లో ప్రవేశం దక్కదని త్రివిధ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి. అగ్నిపథ్‌ను మొత్తంగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసేవారు కొందరైతే, ఆ పథకానికి తగిన మార్పుచేర్పులు చేయాలనేవారు మరికొందరు. అగ్నిపథ్‌కు సవరణలు చేయాలన్న సూచనపై ప్రభుత్వం సుముఖంగా ఉండటం స్వాగతించదగిందే.

ఇవీ చూడండి..

'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'

తెదేపా నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఐడీ ఏడీజీకి వర్ల ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details