ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC On Special Status: 'ప్రత్యేక హోదా'పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By

Published : Dec 21, 2021, 6:28 AM IST

hc on special status: ప్రత్యేక హోదా వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట సభల్లో, ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని న్యాయస్థానాలను కోరలేరని స్పష్టం చేసింది.

hc on special status
hc on special status

hc on special status: చట్ట సభల్లో ప్రధాని ఇచ్చిన హామీని, ఎన్నికల సమయంలో నేతలిచ్చిన హామీలు, బడ్జెట్ ప్రసంగ హామీలను అమలు చేయాలని..న్యాయస్థానాల్ని కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని తెలిపింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపడం లేదని వ్యాఖ్యానించింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదంటూ.. అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్‌ చంద్ర వర్మ హైకోర్టులో పిల్ వేశారు. అప్పటి ప్రధాని పార్లమెంట్​లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఓసారి హామీ ఇచ్చి వెనక్కి తగ్గడానికి వీల్లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హామీలు అమలు చేయాలని కోర్టులను కోరలేరని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 27 కు వాయిదా వేసింది

ABOUT THE AUTHOR

...view details