ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Draft Electoral Rolls 2021: రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

By

Published : Nov 1, 2021, 5:38 PM IST

రాష్ట్ర ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం(state election commission news) ప్రకటిచింది. 2021 నవంబరు 1 తేదీ నాటికి రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య వెల్లడించింది. నవంబరు 30 తేదీ వరకూ ముసాయిదా జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని వెల్లడించింది.

ap election commission
ap election commission

రాష్ట్రంలోని ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది(draft electoral rolls issued by ap election commission news). ఉప ఎన్నిక నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గాన్ని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా గణాంకాలను విడుదల చేసింది. 2021 నవంబరు 1 తేదీ నాటికి రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 4, 4, 23, 407గా నమోదైనట్లు పేర్కొంది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1 కోటీ 99 లక్షల 53 వేల 184గా వెల్లడించింది. మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 04 లక్షల 66,182 మందిగా నమోదైనట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 4041 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇక 67,090 మంది సర్వీసు ఓటర్లుగా నమోదు అయినట్లు ప్రకటించింది.

45, 678 పోలింగ్ స్టేషన్లు..
రాష్ట్రవ్యాప్తంగా 45, 678 పోలింగ్ స్టేషన్లను గుర్తించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 43 లక్షల 31,945 మంది ఓటర్లు ఉన్నట్లు.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 లక్షల 94,362 మంది ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. క్వాలిఫైయింగ్ తేదీ 2022 జనవరి 1 తేదీనాటికి ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఫిర్యాదుల కోసం తుది గడువు..
ముసాయిదా జాబితాలోని ఓటర్లకు సంబంధించిన క్లెయిములు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 2022 జనవరి 5 తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు వివరించింది. నవంబరు 30 తేదీ వరకూ ముసాయిదా జాబితాకు సంబంధంచిన క్లెయిములు, అభ్యంతరాలు , ఫిర్యాదులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ ప్రకటించారు. 2022 జనవరి 1 తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండుతున్న వారంతా నవంబరు 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'మోదీ సభలో ఉగ్రదాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details