ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై జూన్​ 3న విచారణ

By

Published : May 29, 2020, 8:02 PM IST

andhrapradesh legislative council
andhrapradesh legislative council

పార్టీ విప్ ఉల్లంఘించారన్న కారణంతో ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతపై దాఖలైన అనర్హత పిటిషన్​పై శాసనమండలి జూన్ 3 విచారణ జరపనుంది. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలకు మండలి కార్యదర్శి లేఖ రాశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు శివనాథ రెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్​పై శాసన మండలి జూన్ 3న విచారణ జరగనుంది. పార్టీ విప్ ఉల్లంఘించినందున వారిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన ఫిర్యాదు మేరకు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చర్యలు చేపట్టారు.

జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేసింది. రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథ రెడ్డి, పోతుల సునీతలు పార్టీ జారీ చేసిన విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించారని బుద్దా వెంకన్న మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలకు మండలి కార్యదర్శి లేఖ రాశారు. ఛైర్మన్ ఛాంబర్​లో జరిగే విచారణకు హాజరై వాదనలు వినిపించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details