ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఠారెత్తిస్తున్న ఎండలు.. అగ్నిగుండంగా మధ్య కోస్తాంధ్ర..!

By

Published : Mar 31, 2021, 2:35 PM IST

Updated : Mar 31, 2021, 7:43 PM IST

వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 3 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

weather
weather

మహారాష్ట్రలోని విదర్భ నుంచి వీస్తున్న ఉష్ణగాలులు మధ్య కోస్తాంధ్ర ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చాయి. కనీవినీ ఎరగని రీతిలో మార్చి నెలలోనే ఠారెత్తిపోయే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా మే మూడో వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. కడపలో 44.3, ఒంగోలు 40, విజయవాడ 43.5, విశాఖ 34.5, తిరుపతి 43.5, కాకినాడ 37, గుంటూరు 42.1, అనంతపురం 41.8, కర్నూలు 42.3, నెల్లూరు 42.6, శ్రీకాకుళం 41, విశాఖపట్నం 39.8, విజయనగరం 43.8, ఏలూరులో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Last Updated :Mar 31, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details