ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాపై హైకోర్టులో ప్రభుత్వం మెమో.. మూడో వేవ్ ఏర్పాట్లపై స్పష్టత..

By

Published : Sep 8, 2021, 8:22 AM IST

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని... అందులో భాగంగానే గణేష్‌ ఉత్సవాలపై ఆంక్షలు విధించామని తెలిపింది.

andhra-pradesh-government-memo-in-the-high-court-on-corona-precautions
కరోనాపై హైకోర్టులో ప్రభుత్వం మెమో.. మూడో వేవ్ ఏర్పాట్లపై స్పష్టత..

కొవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచామని వివరించింది. వినాయక చవితి వేడుకల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించామని తెలిపింది. కొవిడ్ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో... కట్టుదిట్ట నిబంధనలతో పాఠశాలలు తెరిచినట్టు పేర్కొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వివరాలను సర్కారు ధర్మాసనానికి సమర్పించింది.

రాష్ట్రానికి 28 ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం కేటాయించగా... అందులో 18 ఇప్పటికే సిద్ధమయ్యాయని మెమోలో తెలిపింది. మాస్కు ధరించనివారికి, మాస్కుల్లేని వారిని అనుమతించిన దుకాణ యజమానులకు జరిమానా విధిస్తున్నట్టు వివరించింది. రాష్ట్రంలో 18-45ఏళ్ల ప్రజల్లో 3.68 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని... 45 ఏళ్లు పైబడినవారికి 50.17శాతం టీకాలు వేసినట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి:RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..

ABOUT THE AUTHOR

...view details