ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా చికిత్సపై సాంకేతిక కమిటీ నియామకం

By

Published : May 1, 2021, 8:01 AM IST

రాష్ట్రంలో కరోనా చికిత్సలో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ నిర్వహణ, కంటైన్మెంట్, నియంత్రణ, వ్యాప్తినిరోధక చర్యలపై ప్రభుత్వం సాంకేతిక కమిటీని నియమించింది. రాష్ట్రంలో కరోనా చికిత్సలకు సంబంధించి చేపట్టాల్సిన ప్రోటోకాల్స్, ఇతర అంశాలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.

andhra pradesh government appoint technical team for covid treatment
andhra pradesh government appoint technical team for covid treatment

రాష్ట్రంలో కొవిడ్ రోగుల చికిత్సల్లో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ నిర్వహణ, కంటైన్మెంట్, నియంత్రణ, వ్యాప్తినిరోధక చర్యలపై సాంకేతిక కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ బి.చంద్రశేఖర్​రెడ్డి నేతృత్వంలో 10 మంది వైద్య నిపుణులతో కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలకు సంబంధించి చేపట్టాల్సిన ప్రోటోకాల్స్, ఇతర అంశాలపై ఈ సాంకేతిక కమిటీ సిఫార్సులు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details