ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amit shah: తెలంగాణలో ఖరారైన కేంద్ర మంత్రి అమిత్‌ షా పర్యటన

By

Published : Sep 7, 2021, 4:05 PM IST

ఈ నెల 17వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వద్ద సభలో పాల్గొననున్నారు.

Amit shah
Amit shah

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17న రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపురావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... తన పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా చాలా రోజులుగా డిమాండ్​ చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు.. మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు. కాలక్రమంలో ఈ ప్రాంతమే వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. తెరాస ప్రభుత్వాన్ని నిజాం పాలనతో పోల్చుతూ విమర్శలు గుప్పిస్తోన్న భాజపా.. వాదనను బలపరుచుకునేందుకు ఇదే అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details