ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AMARAVATI: మహిళల చైతన్యయాత్ర..మహాపాదయాత్రపై ప్రజలకు అవగాహన

By

Published : Oct 19, 2021, 4:56 PM IST

AMARAVATI
AMARAVATI ()

మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని వివరిస్తూ మహాపాదయాత్ర చేపట్టేందుకు అక్కడి మహిళలు సంకల్పించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజధానిపై చైతన్య పరుస్తూ.. మహిళల మహాపాదయాత్ర

అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే మహాపాదయాత్ర చేపడతున్నామని రాజధాని మహిళలు చెప్పారు. అమరావతి చైతన్య యాత్రలో భాగంగా తుళ్లూరు మందడంలో మంగళవారం మహిళలు, రైతులు ర్యాలీ చేపట్టారు. మందడం దీక్షా శిబిరం నుంచి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. నవంబరు 1 నుంచి జరిగే మహా పాదయాత్రలో పాల్గొనాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

వైకాపా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయో పాదయాత్రలో వివరిస్తామని రైతులు, మహిళలు వెల్లడించారు. ధర్మబద్ధంగా సాగే తమ పాదయాత్రను ప్రజలు దీవించాలని కోరారు.

ఇదీ చదవండి:

Nakka Anandbabu: నక్కా ఆనంద్‌బాబు ఇంటికి మరోసారి పోలీసులు...

ABOUT THE AUTHOR

...view details