ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో రికార్డు ధర పలికిన మరకత గణపతి లడ్డూ.. 'బాలాపూర్​' ఔట్..

By

Published : Sep 10, 2022, 10:48 PM IST

Alwal Marakata Ganapati Laddu Auction 2022: తెలంగాణలో గణేశ్​ లడ్డూ వేలంపాట అనగానే అందరూ ఎక్కువగా బాలాపూర్​ లడ్డూ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్​ చేసుకుంటూ బాలాపూర్​ లడ్డూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది కాబట్టి. అయితే ఈసారి మాత్రం బాలాపూర్​ లడ్డూ ధరను మరో లడ్డూ దాటేసింది. ఏకంగా బాలాపూర్​ లడ్డూ కంటే రెట్టింపు ధర పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Laddu Auction
అల్వాల్​ మరకత లక్ష్మీగణపతి లడ్డూ

Alwal Marakata Ganapati Laddu Auction 2022:తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్​ పరిధి అల్వాల్​ మరకత లక్ష్మీగణపతి లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్​ చేసింది. ఏకంగా బాలాపూర్​ లడ్డూ ధరనే దాటేసింది. శనివారం జరిగిన లడ్డూ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో లడ్డూ ధర రూ.46 లక్షలు పలికింది. వెంకట్రావు-గీతప్రియ దంపతులు ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా స్వామి వారి లడ్డూను దక్కించుకుంటున్నట్లు వెంకట్రావు దంపతులు పేర్కొన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లడ్డూ దక్కించుకోవడం అత్యంత సంతోషంగా ఉందన్నారు. మరకత గణపతి ఆశీస్సులతో తాము ఉన్నత స్థాయికి వచ్చినట్లు తెలిపారు. లడ్డూకు రికార్డు స్థాయి ధర పలకడం పట్ల ఆలయ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం జరిగిన వేలంపాటలో బాలాపూర్​ లడ్డూను రూ.24 లక్షల 60 వేలకు ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details