ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS Minister Niranjan Reddy: 'ఈ యాసంగిలో రైతులు ఆ పంట వేయవద్దు'

By

Published : Nov 6, 2021, 7:43 PM IST

ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని (Niranjan Reddy On Rice Crop) తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు.

TS Minister Niranjan Reddy
TS Minister Niranjan Reddy

సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని (Niranjan Reddy On Rice Crop) తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వానాకాలంలో పండే వరి కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని (Niranjan Reddy On Rice Crop) కోరారు. యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలని నిరంజన్‌ రెడ్డి సూచించారు.

విత్తన కంపెనీలతో ఒప్పందమున్న రైతులు.. వరి వేసుకోవచ్చన్న నిరంజన్‌ రెడ్డి... మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని పేర్కొన్నారు. యాసంగిలో వరిని ప్రభుత్వం (Niranjan Reddy On Rice Crop) కొనదని స్పష్టం చేశారు. వానాకాలం వరి పంటను మాత్రమే ప్రభుత్వం కొంటుందని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదే అని వెల్లడించారు.

వానాకాలంలో పండే వరిలో ఏ విధమైన ఇబ్బంది లేదు కొనుగోళ్ల విషయంలో. కేంద్రం ఎంత కొన్నా... మిగతాది మన రాష్ట్ర అవసరాలకు కావచ్చు, మిల్లర్ల వ్యాపారానికి కావచ్చు.. ఇక్కడ వినియోగం అవుతుంది. ఎఫ్​సీఐ మేం కొనము అన్న తర్వాత... తెలంగాణ ప్రభుత్వం కొనడానికి మెకానిసమ్ ఏముంటది? కొని ఏం చేస్తది. కాబట్టి తెలంగాణ రైతులకు చాలా స్పష్టంగా... వినమ్రంగా, విజ్ఞప్తిగా, కరాఖండిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తున్నా. ఈ యాసంగిలో దయచేసి మీరు వరి వేయకండి. వరికి బదులు ఇతర పంటలు వేసుకోండి.

-- నిరంజన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి

ఇదీ చదవండి:

Tirumala: ఈ నెలలో మూడు రోజులపాటు.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details