ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో దారుణం.. బాలికపై 63 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

By

Published : Jan 23, 2020, 3:12 PM IST

సభ్య సమాజం తలదించుకునే ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. పెద్దమనిషి తరహాలో పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ వ్యక్తి నీచమైన చర్యకు ఒడిగట్టాడు. మనుమరాలి వయసున్న బాలికపై 63ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

తెలంగాణలో దారుణం.. బాలికపై 63 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
తెలంగాణలో దారుణం.. బాలికపై 63 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

బాలికపై వృద్ధుడి అత్యాచారం
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో 63 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారం చేసిన ఘటన బుధవారం జరిగింది. మండల పరిధిలోని గ్రామంలో ఓ బాలిక తన తండ్రికి ఫోన్‌ చేసేందుకు మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటిరెడ్డి ఇంటికి వెళ్లింది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడాక మిరపకాయలు తీసుకొని రమ్మని కోటిరెడ్డి బాలికకు పురమాయించాడు. ఆమె వాటిని తీసుకొని తిరిగి అతని ఇంటికి వెళ్లగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నిందితుడిని చితకబాదిన గ్రామస్థులు

కాసేపటికి బాలిక తల్లి ఇంటికొచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి కుమార్తె కేకలు వినిపించటంతో అక్కడికి వెళ్లింది. బాలిక రోదిస్తూ జరిగినదంతా తల్లికి వివరించింది. ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని చితకబాదారు. కోటిరెడ్డి ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవటంతో ఇంటిని ముట్టడించారు. బయటకు వచ్చిన అతనిపై దాడిచేసి కొట్టారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు

ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, కూసుమంచి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన నిందితుణ్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదిగొండ ఠాణాలో ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఖమ్మం మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ అంజలి.. బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కోటిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ చూడండి:

భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?

sample description

ABOUT THE AUTHOR

...view details