ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire Accident: పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

By

Published : Sep 17, 2021, 12:25 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో మంటలు చెలరేగాయి.

A fire accident in a chemical godam in Pedda Amberpet
పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో మంటలు చెలరేగాయి. గోదాము నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.... ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు.

గోదాములో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. గోదాము పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. గోదాములోకి వెళ్లే మార్గం లేకపోవడంతో.. అధికారులు, స్థానికులు జేసీబీలతో గోడలు కూల్చివేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details