ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైక్​పైకి దూసుకొచ్చిన బస్సు.. సీసీ కెమెరాలో దృశ్యాలు

By

Published : Sep 21, 2022, 10:38 PM IST

A boy road accident in Old city: మామతో కలిసి సరదాగా బైక్​పై వెళ్తున్న ఆ బాలుడికి విధి చిన్నచూపు చూసింది. ప్రమాదం బస్సు రూపంలో వెనుక నుంచి తరుముకొచ్చింది. అభం శుభం తెలియని ఆ ఐదేళ్ల బాలుడిని బస్సు ఢీకొట్టడంతో ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదంతా హైదరాబాద్​ పాత బస్తీలో జరగగా.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

A boy road accident in Oldcity
బైక్​పైకి దూసుకొచ్చిన బస్సు

A boy road accident in Oldcity: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మెున్న మెడ్చల్​ రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మరణ వార్త మరువక మునుపే.. ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీలు మన కళ్లపై ఇంకా కదలాడుతుండగానే తాజాగా పాతబస్తీలో అభంశుభం తెలియని పసిపిల్లాడిపై ఆర్టీసీ బస్సు పడగవిప్పింది. దీంతో బాలుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​లోని పాతబస్తీలో పురాని హావేలి ప్రాంతంలో గత మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్​పై వెళ్తున్న వారిపైకి వెనుక నుంచి ఢీకొంది. దీంతో బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి, తన మేనల్లుడు హుస్సేన్(5)​కి త్రీవ గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రైవేట్​ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​పైకి దూసుకొచ్చిన బస్సు.. సీసీకెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details