ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Oct 9, 2022, 7:02 PM IST

..

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

  • జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపు నడక
    28th Day Farmers Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 28వ రోజూ కదనోత్సాహంతో సాగింది. జోరువాననూ లెక్కచేయక రైతులు... లక్ష్యంవైపు నడక సాగించారు. స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ఎక్కడికక్కడ ఎదురెళ్లి కర్షకులను స్వాగతించారు. వారిపై పూల వర్షం కురిపిస్తూ.. కలిసి అడుగులు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. దేవిక బంధువుల డిమాండ్​
    Postmortem to Devika dead body: కాకినాడ జిల్లాలో ఉన్మాది చేతిలో బలైపోయిన యువతి దేవిక మృతదేహానికి శవపరీక్ష పూర్తయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవిక కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి.. నిందితుడికి త్వరగా శిక్షపడాలని అధికారులను ఆదేశించారు. ఉత్తుత్తి ప్రకటనలు మానేసి.. నిందితుడికి వెంటనే శిక్షపడేలా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రముఖ దంత వైద్యులు ఎ.ఎస్‌.నారాయణ, మోహన్‌ అట్లూరికి ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ సన్‌’ అవార్డులు
    Like Father Like Son Awards: ప్రముఖ దంత వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.ఎ.ఎస్‌. నారాయణ, ఆయన తనయుడు డాక్టర్‌ మోహన్‌ అట్లూరిలను ‘హై9’ అనే సంస్థ ఘనంగా సత్కరించింది. ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ సన్‌’ కేటగిరీలో వీరిద్దరినీ అవార్డులతో గౌరవించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నీట మునిగిన అపార్ట్​మెంట్​ సెల్లార్లు.. చెరువులను తలపించిన రహదారులు
    RAIN EFFECT IN MANIKONADA AND RAJENDRANAGAR: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో.. మణికొండ, రాజేంద్రనగర్​ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వర్ష బీభత్సం.. నోయిడాలో కుంగిపోయిన రోడ్డు.. భారీగా గుంత
    భారీ వర్షాలకు గ్రేటర్ నోయిడాలోని ఓ రోడ్డు ఒక్కసారిగా ‌కుంగిపోయింది. గౌతమ బుద్ధనగర్‌లోని ఎక్స్‌ప్రెస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భారీ గుంత ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 108 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం.. బాత్​రూమ్​కు తీసుకెళ్లి.. కాళ్లు నరికి..
    రాజస్థాన్​లో దారుణం జరిగింది. 108 ఏళ్ల వృద్ధురాలి కాళ్లు నరికి ఆమె వెండి కడియాలను ఎత్తుకెళ్లారు దుండగులు. మరోవైపు, తన మాజీ భార్య మరొకరిని వివాహం చేసుకోవడం నచ్చని ఓ వ్యక్తి హత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటన బంగాల్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
    ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఓ సారి 'జీరా వాటర్'​ ట్రై చేయండి!
    వెయిట్​ లాస్.. చాలా మంది కల. బరువు తగ్గి.. స్లిమ్​గా, ఫిట్​గా అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఉన్నపళంగా తిండి తినడం మానేస్తారు. మరికొందరు జిమ్​లో గంటల తరబడి గడుపుతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఓ సారి జీరా నీళ్లను ట్రై చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఊర్వశి రౌతేలా చేసిన ఆ పని పంత్​ కోసమేనా?
    బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ఇన్​స్టా పోస్ట్ వైరల్​గా మారింది. నెటిజన్లంతా ఆమె.. క్రిికెటర్​ పంత్​ కోసమే ఇలా చేసిందని భావిస్తున్నారు. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నాగచైతన్య మూవీటీమ్​పై దాడి.. గుడి దగ్గర ఆ పని చేశారని
    యంగ్​ హీరో నాగ చైతన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​ ప్రస్తుతం కర్ణాటకలోని ఓ చారిత్రక గుడిలో జరుగుతోంది. అయితే అక్కడి స్థానికులు ఆ చిత్రీకరణను అడ్డుకున్నారని తెలిసింది. ఎందుకంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details