ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Sep 10, 2022, 6:59 PM IST

..

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

  • "జగన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట తెచ్చి... అమరావతిలో కుంపటి పెట్టారు"
    tdp leaders on padayatra: రాజధాని విషయంలో ప్రభుత్వంపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట తెచ్చి అమరావతిలో కుంపటి పెట్టారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. అమరావతి మహిళా రైతులు చేపడుతున్న పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Munneru stream: కర్మకాండలు చేసేందుకు వెళ్లి... వాగులో చిక్కుకుని
    ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని మున్నేరులో కర్మకాండలు చేయడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక బయటకు వచ్చే సమయంలో ఒక్కసారిగా ట్రాక్టర్ మునిగిపోయేంత నీరు చుట్టూ చేరటంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. గ్రామస్థులు వారిని గమనించి బలమైన తాళ్ల సాయంతో వంతెన పైకి చేర్చారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Penna river: పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు క్షేమం
    Penna river: పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. నది దాటేందుకు ప్రయత్నించి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువ కావడంతో ప్రవాహంలో చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. అసలేం జరిగిందంటే..?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పక్కకు ఒరిగిన భారీ గణనాథుడు.. ఎక్కడంటే..
    విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయక విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో భారీ మట్టి గణపతి దర్శనాలను నిలిపివేశారు. వర్షం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున.. నిర్ణయించిన రోజు కన్న ముందుగానే వినాయక నిమజ్జనం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 12 అడుగుల కింగ్​ కోబ్రా కలకలం.. ఇంట్లోకి వెళ్తుండగా..
    ఉత్తరాఖండ్​ కోట్​ద్వార్​లోని హరేంద్రనగర్​ ప్రాంతంలో కింగ్​ కోబ్రా కలకలం రేపింది. 12 అడుగులకుపైగా పొడవున్న ఈ సర్పాన్ని చూసి జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నివాస ప్రాంతంలోకి వచ్చిన కోబ్రా.. అనిల్​ రాటూరి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడుతుండగా గమనించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు
    ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఉత్తర్​ప్రదేశ్​ నగ్రాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు మద్యం విషయంలో గొడవ తలెత్తగా యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన ఝార్ఖండ్​ గఢ్వాలో జరిగింది. దేవుడికి పెట్టిన నైవేద్యం దొంగలించాడని ఓ బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు పూజారి. మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గేమింగ్ యాప్​ పేరుతో బడా ఫ్రాడ్​.. ఈడీ సోదాలతో గుట్టు రట్టు.. రూ.7కోట్లు స్వాధీనం
    'మోసపూరిత' మొబైల్ గేమింగ్​ యాప్​ ప్రమోటర్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కీలక పురోగతి సాధించింది. కోల్​కతాలో సోదాలు జరిపి ఏకంగా రూ.7కోట్లు నగదు స్వాధీనం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్​లో నవశకం.. రాజుగా ఛార్లెస్ అధికారిక ప్రకటన
    Britain New King : బ్రిటన్​ రాజ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజబెత్​-2 మరణానంతరం.. ఆమె పెద్ద కుమారుడు, వేల్స్​ మాజీ యువరాజు ఛార్లెస్​ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పాక్​ కెప్టెన్ నేనే' అని చెప్పుకుంటున్న బాబర్.. ఇంతకీ ఏమైంది?
    ఆసియా కప్ 2022 లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్​తో విజయ్.. రంగంలోకి టాప్ ప్రొడక్షన్ హౌస్!
    హీరో విజయ్​ దేవరకొండ.. 'లైగర్'​ సినిమా తర్వాత తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా రౌడీ హీరో​ కొత్త మూవీకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​తో సౌత్​లో పాపులర్ అయిన దర్శకులు రాజ్​, డీకే.. విజయ్​తో సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details