ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Jun 18, 2022, 6:59 PM IST

..

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM

  • Nara Lokesh : ' గిరిజనుల్ని మోసం చేస్తోన్న.. విక్టర్​బాబును అరెస్టు చేయాలి'
    గిరిజ‌నుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత‌బాబు అనుచ‌రుడైన దూడ విక్టర్‌బాబు దందాల‌పై.. ద‌ర్యాప్తు చేయాల‌ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్‌ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చెట్లవాడ గ్రామానికి చెందిన దూడ విక్టర్ బాబు.. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని గిరిజ‌నుల్ని మోస‌గిస్తున్నార‌ని ట్విట్టర్‌లో ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దారి' కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయ కుటుంబం.. చక్రాల కుర్చీలో తాడేపల్లి బాట
    బాపట్ల జిల్లాలో వైకాపా నేతల దౌర్జన్యానికి ఓ ఉపాధ్యాయురాలి కుటుంబం రోడ్డున పడింది. ఇంటికి వెళ్లే దారిలో వైకాపా నేతలు గోడకట్టారని కొరిశపాడు మండలం బొడ్డువానిపాలేనికి చెందిన సుధారాణి వాపోయారు. న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలిసి.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చక్రాల కుర్చీలో బయలుదేరిన సుధారాణితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సికింద్రాబాద్​ తరహాలో ప్లాన్​.. లాఠీఛార్జ్​తో అడ్డుకున్న పోలీసులు
    warangal police at railway station: సికింద్రాబాద్ తరహాలోనే వరంగల్ రైల్వేస్టేషన్​లోనూ ఆందోళనకు యత్నించిన నిరసనకారులను పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు లాఠీఛార్జ్ చేసి నియంత్రించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కల తీరకుండానే ప్రాణాలు వదిలావా'.. రాకేశ్ తల్లి ఆవేదన..
    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్‌ అనే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీ మంత్రి వెల్లంపల్లి అధికార దర్పం.. ప్రశ్నించిన యువకుడి అరెస్టుకు ఆదేశం !
    నాపైనే ఆరోపణలు నిరూపించకపోతే కేసు పెట్టి లోపలేయండంటూ.. ప్రశ్నించిన యువకుడిపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చిందులేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్​ పర్యటనకు వచ్చిన వెల్లంపల్లి వద్ద చెత్తపన్ను గురించి ఓ యువకుడు వాపోయారు. వెల్లంపల్లిపై ప్రతిపక్షాల అవినీతినీ యువకుడు ప్రస్తావించడంపై.. వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు
    Agnipath protests in India: సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించగా పంజాబ్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై యువత ఆందోళనకు దిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 11వ శతాబ్దం విగ్రహాలు చోరీ.. 37ఏళ్ల తర్వాత స్వదేశానికి.. రూ.కోట్లలో విలువ
    Tamil Nadu stolen idols recovered: తమిళనాడులో చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు 37 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నాయి. న్యూయార్క్ సిటీ మ్యూజియం నుంచి ఈ రెండు విగ్రహాలను తమిళనాడు అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అరుదైన రెండు తలల పాము.. భక్తితో గ్రామస్థుల పూజలు..
    Two Headed Snake: ఛత్తీస్​గఢ్​లోని జంజ్​గిర్​చంపా జిల్లాలో గురువారం అరుదైన రెండు తలల పాము కనిపించింది. దానిని చూడడానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కొందరు గ్రామస్థులు ఏకంగా పూజలు చేశారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు.. వన్డేల్లో ఇది ఎన్నోసారి?
    నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో విజృంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా 498 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేశారు. సాల్ట్, మలన్, బట్లర్.. ముగ్గురూ​ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో ఇలాంటి అరుదైన సంఘటన గతంలోనూ రెండుసార్లు జరిగింది. అది ఎప్పుడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీజర్​తో ఆది అదుర్స్​.. లీకైన రణ్​బీర్​ పోస్టర్​తో ఇంటర్నెట్​ షేక్​!
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఆది సాయికుమార్ నటిస్తున్న 'తీస్ మార్ ఖాన్', బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​ కొత్త చిత్రం 'షంషేరా', సాయి పల్లవి 'విరాట పర్వం' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details