ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jul 20, 2022, 2:59 PM IST

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

  • శింగనమలలోని చెరువులో మూడు మృతదేహాలు లభ్యం..
    DEAD BODIES: అనంతపురం జిల్లా శింగనమలలోని చెరువులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • loan App agents harassment : వేధింపులు తాళలేక 9 మంది కనిపించకుండాపోయారు
    loan App agents harassment : వేధింపులు తాళలేక హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో రెండు రోజుల్లో రుణయాప్‌ల బాధితుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వేర్వేరు ఠాణాల్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "వరద మిగిల్చిన గోడు.. ఆదుకున్న బడ్డీ కొట్టు"
    YEDURULANKA: వాళ్లకి ఏటా వరదలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే వచ్చాయి. ఏం జరుగుతుందిలే అనుకున్న వారిని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టింది. తలదాచుకోవడానికి గూడు లేక, తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం గట్టుపై నిర్వహించుకునే చిన్న బడ్డీదుకాణమే వారికి ఆవాసంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "పింఛన్‌ ఇప్పించండి.. ప్లీజ్‌".. తైక్వాండో క్రీడాకారుడి దీనగాథ
    TAEKWONDO PLAYER: ఐదేళ్లకే తైక్వాండో క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. పదేళ్లకే పతకాల వేట ప్రారంభించాడు. 12 ఏళ్లు వచ్చేసరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పతకాలు గెల్చుకున్నాడు. క్రీడాకారుడిగా ఉన్నతస్థాయికి చేరతాడనుకున్న కన్నవారి ఆశల్ని వమ్ము చేస్తూ.. ఊహించని విధంగా కదల్లేని స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కల్తీ సారా తాగి 9 మంది మృతి.. మరికొందరికి అస్వస్థత
    కల్తీ సారా తొమ్మిది మందిని కబళించింది. అక్రమంగా నిర్వహిస్తున్న లిక్కర్ షాపులో మద్యం సేవించి వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 300కిలోల హెరాయిన్ కేసులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!
    NIA raids trichy: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఎన్​ఐఏ బుధవారం ఈ సోదాలు నిర్వహించింది. మరోవైపు జమ్ము శ్రీనగర్​లో లభ్యమైన తుపాకుల కేసులోనూ సోదాలు నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?
    Srilanka new president: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్​ కేసులో ట్విస్ట్.. బ్యాన్​పై దిల్లీ హైకోర్టు స్టే
    Service charge in restaurant: హోటల్స్, రెస్టారెంట్స్​లో బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నిబంధనలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. నవంబర్​ 25 వరకు సీసీపీఏ తెచ్చిన నిబంధనలను అమలు చేయరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ సక్సెస్​ మంత్రతో ముందుగు సాగండి- కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం
    కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు క్రీడాకారులకు సక్సెస్​ మంత్రను బోధించారు మోదీ. కొందరు క్రీడాకారుల అనుభవాలను మోదీ తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సామ్‌-చైది చూడముచ్చటైన జంట.. ఎప్పుడూ గొడవపడలేదు'
    సమంత-నాగచైతన్య పెళ్లయ్యాక ఎలా ఉండేవారో చెప్పారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించారు. పెళ్లయాక వాళ్లు తమ అపార్ట్‌మెంట్స్‌లోనే ఉండేవారని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details