ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : May 9, 2022, 11:02 AM IST

11AM TOP NEWS

..

  • Cyclone Asani: తీవ్రంగా మారిన 'అసని'.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు
    Cyclone Asani: పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో తీవ్ర 'అసని' తుపానుగా మారింది. దీంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలుండగా.. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విద్యార్థులు, యువతే లక్ష్యం.. విశాఖలో జోరుగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకం
    Illegally selling of pentazocine lactate injections: విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమబంగా నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిఘా పెట్టిన వారు.. ముగ్గురు నిందితలను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Fire accident: చెత్తకు నిప్పు పెడుతుండగా.. మంటలంటుకుని
    Fire accident: అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించడంతో గాలి బీభత్సానికి చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • B.pharmacy Student Case: బీఫార్మసీ విద్యార్థిని కేసు.. నిందితుడు అరెస్ట్​
    B.pharmacy student case: బీఫార్మసీ విద్యార్థిని మృతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 29 మంది మృతి
    India Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఒక్కరోజులో 3,207‬ కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 29 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆన్​లైన్​లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..
    James Atkinson pizza: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్​ చేసిన 23 ఏళ్ల యువకుడు.. రెండు ముక్కలు తిన్న వెంటనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా గుండె ఆగి చనిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నేను అనుమానాస్పదంగా మరణిస్తే..'- రష్యాకు గురిపెడుతూ మస్క్​ ట్వీట్​!
    Tesla CEO Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. తాజాగా చేసిన ఓ ట్వీట్​ సంచలనంగా మారింది. 'అనుమానాస్పద మరణం' అంటూ చేసిన ట్వీట్​ చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్​ వెనక ఉన్న ఆంతర్యమేమిటి? రష్యా నుంచి మస్క్​కు ప్రాణహాని ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి
    సెన్సెక్స్​ 600 పాయింట్లు నష్టం: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధోనీ సూపర్​ రికార్డ్​.. ఐపీఎల్​ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ..
    IPL 2022 DC VS CSK dhoni record: దిల్లీతో జరిగిన మ్యాచ్​లో 91 పరుగులు భారీ తేడాతో సీఎస్కే గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై జట్టు సహా కెప్టెన్​ ధోనీ ఓ అరుదైన రికార్డు సాధించారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నవ్వులు పూయిస్తున్న 'ఎఫ్​ 3' ఫన్​ ట్రైలర్​
    F3 movie trailer: వెంకటేశ్, వరణ్​ తేజ్​ కలిసి నటించిన 'ఎఫ్ 3' ఫన్​ ట్రైలర్​ వచ్చేసింది.​ ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. దాన్ని మీరు చూసేయండి... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details