ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Top news: ప్రధాన వార్తలు @11AM

By

Published : Oct 20, 2021, 11:01 AM IST

11 AM top news

..

  • TDP Nirasana : తెదేపా నిరసన గళం.. పోలీసు అరెస్టుల పర్వం..
    తెలుగుదేశం కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం రాష్ట్ర బంద్‌ కు పిలుపు నిచ్చింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • TTD : తితిదే దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా తితిదే నియమించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Covid vaccination : వ్యాక్సినేషన్‌లో నెల్లూరు ఫస్ట్‌

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఇస్తున్న వ్యాక్సినేషన్‌లో.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'

గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే.. దేశంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు మోదీ. ఇప్పుడు తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో.. అవినీతిపై పోరాటం చేస్తోందన్నారు. ప్రజలను, దేశాన్ని మోసం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Covid Cases In India: దేశంలో మరో 14,862 మందికి కరోనా

భారత్​లో కొత్తగా మరో 14,862 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 197మంది ప్రాణాలు కోల్పోగా.. 19,446 మంది వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లఖింపుర్‌ ఖేరి హింసాకాండపై నేడు 'సుప్రీం'లో విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అక్టోబర్ 3 నాటి ఈ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొండచరియలు విరిగిపడి.. 21మంది మృతి

నేపాల్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Stock market: లాభాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్​ ​సూచీలు​​

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తెరుకుని.. లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 126 పాయింట్ల లాభంతో 61,842 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 32 పాయింట్లకుపైగా పెరిగి.. 18,451 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Sehwag birthday: బ్యాట్​తో బౌండరీలు.. ట్విట్టర్​లో పంచులు..!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బ్యాటింగ్​ చేసినంత సులభంగా ట్వీట్స్​ చేస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. బుధవారం అతడి పుట్టినరోజు సందర్భంగా (sehwag birthday) వీరూ పంచింగ్ ట్వీట్స్​తో పాటు అతడి నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Radhe shyam teaser: 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేస్తుందోచ్..

ప్రేమకథతో తెరకెక్కిన 'రాధేశ్యామ్' టీజర్​కు(radhe shyam teaser) టైమ్ ఫిక్సయింది. శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషల వారికి అనువుగా ఉండేలా ఒకే టీజర్​ను రిలీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details