ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సొంత జిల్లాలో సీఎం జగన్​కు షాక్- వైసీపీని వీడిన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి - YSRCP Sarpanch Resign in Proddatur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 10:57 AM IST

ysrcp_sarpanch_resign_in_proddatur

YSRCP Sarpanch Resign in Proddatur :  సీఎం జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీకి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలో బలమైన నాయకుడిగా ఉన్న సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా (Resign) చేశారు. తాను రూ.2 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయానని నాగేంద్ర రెడ్డి, శేఖర్ యాదవ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ధైర్యముంటే అమ్మవారి దగ్గర ప్రమాణానికి రావాలని వారికి సవాల్ విసిరారు. 

13 YSRC Sarpanches Resign in Kadapa District : ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవినీతిని సహించలేకే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతానని ప్రకటించారు. మరోవైపు తీవ్ర అసంతృప్తితో ఉన్న వైఎస్సార్సీపీ (YSRCP) ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా పార్టీ మారతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక రాజకీయాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

ABOUT THE AUTHOR

...view details