ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తన తరువాతే ఎవరైనా- బార్బర్ షాప్​లోవాలంటీర్ దౌర్జన్యం! సగం గడ్డంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 5:31 PM IST

YSRCP Followers Attack on Congress Followers : బార్బర్ షాప్​లో వైఎస్సార్సీపీ వర్గీయులు తనపై దౌర్జన్యానికి దిగారంటూ బాధితుడైన కాంగ్రెస్ కార్యకర్త వాపోయాడు. అనంతరం సగం గడ్డంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

ముందుగా అధికార పార్టీ వారికి గడ్డం చేయాలంటా? : పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త వెంకట రాముడు గడ్డం తీయించుకోవడానికి బార్బర్ దుకాణానికి వచ్చారు. కుర్చోలో కూర్చోని గడ్డం తీయించుకుంటుండగా మొదట తామే గడ్డం తీయించుకోవాలంటూ అధికార పార్టీ వర్గీయులు తనతో వాగ్వాదానికి దిగారని వెంకట రాయుడు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్, అతని తండ్రి శ్రీరాములు కలిసి తనను చొక్కా పట్టుకుని దుకాణం నుంచి బయటకు తరిమేశారని వాపోయారు. అనంతరం తన చికెన్ దుకాణాన్ని కూడా కాల్చి వేస్తామని బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్​లో బాధ్యులపై సగం గడ్డంతోనే ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details