ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 12:13 PM IST

YS Sharmila Fire on CM Jagan: ఒక్క అవకాశం అంటే నమ్మి ప్రజలు ఓటేస్తే, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్‌ ప్రత్యేక హోదాను, పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టారని ఏపీ పీసీసీ చీఫ్​ వైఎస్‌ షర్మిల ఆరోపించారు. అనంతపురంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలతో షర్మిల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హంద్రీనీవా ప్రాజక్టును పూర్తిచేస్తామన్న జగన్‌ హామీ ఏమైందని షర్మిల నిలదీశారు. వైస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించినట్లు ఆమె గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న తనపైనే దాడులకు దిగుతున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె విమర్శించారు.  

"మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే  హంద్రీనీవా పూర్తి చేస్తామని జగన్​ ఆ రోజుల్లో అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం హంద్రీనివాను పూర్తి చేయడం లేదని చెప్పి, జగనన్న జలదీక్ష కూడా చేశారు. ఇప్పుడు ఏమైంది జగనన్నా అని అడుగుతున్నాం. అంతేకాకుండా నాపై ఎనలేని దాడులు చేస్తున్నారు." - వైఎస్​ షర్మిల, పీసీసీ అధ్యక్షురాలు

ABOUT THE AUTHOR

...view details