ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుళాయిల రిపేర్​కు రూ.1500 ఇవ్వాల్సిందే - వైసీపీ ఎంపీటీసీ దౌర్జన్యం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 1:44 PM IST

YCP MPTC Illegally Collecting Money to Repair Water Taps: కాలనీల్లో కుళాయిల మరమ్మతులు చేయించాలని చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు నారాయణమ్మను ప్రజలు నిలదీశారు. పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్న తాము ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించారు. దీంతో ఎంపీటీసీ నారాయణమ్మ, ఆమె కుమారుడు లక్ష్మీనారాయణ ప్రజలతో వాదనకు దిగారు. అనంతపురం జిల్లా రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాల కాలనీలో కొత్తగా మురుగు కాలువలు నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో కుళాయి పైపులు మరమ్మతుకు చేరాయి. పంచాయతీ నిధులు వెచ్చించి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించి నారాయణమ్మ, ఆమె కుమారుడు లక్ష్మీనారాయణ ప్రతి ఇంటికి 15 వందల రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.  శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి ఏకంగా 10,000 డిమాండ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారిని నిలదీశారు. ఎమ్మెల్యే దీనిపై స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని కాలనీ ప్రజలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details