ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడపలో కొనసాగుతున్న వైసీపీ నేతల భూ కబ్జాలు - ప్రజా సంఘాల హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 4:43 PM IST

YCP Leaders Land Grabbing  YSR District : కడపలో వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జాల పర్వం ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. నగర శివారులోని రైల్వే వంతెన కింద ఉన్న బుగ్గ వంక స్థలంతోపాటు సమీపంలో ఉన్న వాగు స్థలాలు కబ్జాకు గురయ్యాయని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను సైతం కబ్జాలు చేస్తూ కడప నగర ప్రజలను భవిష్యత్తులో వరదలకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కబ్జాలకు పాల్పడిన వారిపై తక్షణం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజురోజుకూ వైఎస్సార్సీపీ నాయకుల కబ్జాలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. నగరంలో ఇంత జరుగుతున్న పోలీసులు, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణం కబ్జాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details