ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా పవర్​ కట్​ - రెచ్చగొట్టొద్దని వార్నింగ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 8:17 PM IST

YCP Leaders Fight in YSR Asara Program in Anantapur District : అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన వైఎస్​ఆర్ ఆసరా కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాలోని కనేకల్ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాయదుర్గం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గం ఇంఛార్జి మెట్టు గోవిందరెడ్డిలు హాజరయ్యారు. తరువాత మండలంలోని 9132 మంది లబ్ధిదారులకు రూ.5.77 కోట్ల చెక్కును అందిచారు. అనంతరం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రసంగం మెుదలు పెట్టగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తరువాత సభ నుంచి మహిళలు పెద్ద ఎత్తున బయటికు వెళ్లిపోయారు. దీంతో అవమానకరంగా భావించిన రామచంద్రారెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది సరైన పద్ధతి కాదని చిందులు వేశారు. మెట్టు గోవింద్ రెడ్డి వర్గీయులే కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేశారని మండిపడ్డారు. తనను రెచ్చగొట్టి ప్రజల్లో అవమానం చేయాలనుకునేవారు రాజకీయాల్లో కొనసాగలేరని హెచ్చరించారు. మరో రెండు నెలల్లో ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, అప్పుడు ప్రజలు పనులు ఎవరితోనైనా చేయించుకోవచ్చని తెలిపారు. అవసరమైతే నా వద్దకు వస్తే చేసి పెడతానని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details