ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచార ర్యాలీ - ప్రత్యక్షప్రసారం - Varun Tej Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 5:26 PM IST

Updated : Apr 27, 2024, 6:46 PM IST

Varun Tej Election Campaign Rally in Pithapuram Constituency Live: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్‌తేజ్‌  ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్‌ మా‌ట్లాడారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Last Updated : Apr 27, 2024, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details