ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'దుష్టులను శిక్షించమ్మా గంగమ్మ తల్లి' - తిరుపతిలో బోగస్ ఓట్లపై టీడీపీ వినూత్న నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 4:44 PM IST

TDP Leaders Protest On Tirupathi Fake Votes: దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు గంగమ్మ తల్లి అంటూ తిరుపతిలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా నిరసనలు (protest) తెలిపారు. తిరుపతిలో 35 వేల దొంగ ఓట్లను తొలగించి రానున్న ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని టీడీపీ నాయకులు అమ్మవారిని వేడుకున్నారు. తిరుపతి నగరంలోని గంగమ్మ ఆలయం వద్ద సున్నపు కుండలు నెత్తిపై పెట్టుకుని తిరుపతి టీడీపీ ఇన్​ఛార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. 

నగరంలోని దొంగ ఓట్లు (bogus votes) తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, దొంగ ఓట్లకు తావులేకుండా ఓటరు జాబితా(voter List) స్వచ్ఛందంగా రూపొందించాలని అమ్మవారిని వేడుకున్నట్టు టీడీపీ తిరుపతి పార్లమెంట్‍ అధ్యక్షుడు నరసింహయాదవ్‍ పేర్కొన్నారు. తిరుపతిని కాపాడు గంగమ్మ తల్లి అంటూ మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు మంచి బుద్ధి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దొంగ ఓట్లకు తిరుపతిని అడ్డాగా వైసీపీ నాయకులు మార్చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని టీడీపీ నేతలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details