ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: వైఎస్ సునీత కామెంట్స్​పై వర్ల రామయ్య మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 4:08 PM IST

Updated : Mar 1, 2024, 4:25 PM IST

TDP Leader Varla Ramaiah Press Meet: వైఎస్ సునీత కామెంట్స్​పై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉదయం తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  హత్యా రాజకీయాలు ఉండకూడదని, తన అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని వైఎస్​ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని విన్నవించారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా తన తండ్రి హత్యకేసు గురించే అడుగుతున్నారని, ఈ ఐదేళ్లు తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని సునీత అన్నారు. తనకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతల తెలిపారు. తనకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాల తెలిపారు. చంద్రబాబు, మహాసేన రాజేష్‌, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలామంది సహకరించారని అన్నారు. సునీత కామెంట్స్​పై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.  
Last Updated : Mar 1, 2024, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details