ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో వైసీపీ నాయకులు హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నారు : కొల్లు రవీంద్ర - Kollu Ravindra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 2:51 PM IST

kollu_ravindra

TDP Leader Kollu Ravindra Comments YCP Attacks in Krishna District : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను ప్రేరేపించి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. చంద్రబాబు, పవన్​ కల్యాణ్ లపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని తట్టుకోలేక భయంతోనే ఈ విష సంస్కృతికి అధికార నేతలు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు నియోజకవర్గంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం లేదని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ మొదలు కాక ముందే చాలా ప్రాంతాల్లో వైసీపీ దాడులు చేయడానికి సిద్ధయ్యారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలని దించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో వైసీపీ అరాచకాలు మితిమీరే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details