ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం రెండూ మోసమే: కనకమేడల రవీంద్ర కుమార్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 1:55 PM IST

TDP Leader Kanakamedala Ravindra Kumar Allegations on YSRCP : రాష్ట్రంలో పక్కా గృహ నిర్మాణ పథకం పక్కా స్కాంగా మారిందని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఐదు ఏళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కనీసం ఇచ్చిన హామీలో 25 శాతం కూడా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇళ్ల నిర్మాణ పథకంలో జగన్ లూటీ : రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణ పథకం రెండూ మోసపూరితమేనని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల (YSR Jagananna Colonies) పేరుతో అధికార పార్టీ నేతలు చెరువులు, అసైన్డ్ భూముల్ని కబ్జా చేశారని నిప్పులు చెరిగారు. ఇళ్ల పట్టాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు కూడా మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా జగన్ రెడ్డి మడమ తిప్పారని దుయ్యబట్టారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకాన్ని జగన్ రెడ్డి లూటీ చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details